Sunday, September 9, 2018

వినాయకచవితి శుభాకాంక్షలతో


        వినాయకచవితి
                    శుభాకాంక్షలతో 
శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం 
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే

అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ 
అవిఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా 

నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన
ఈప్సితంమే వరం దేహి వరత్రచ పరాంగతిమ్

వినాయక నమస్తుభ్యం సంతతం మోదక ప్రియ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా

గజాననం భూతగణాధి సేవితం  
కపిత్థ జంబూ ఫలసార భక్షిణం 
ఉమాసుతం శోకవినాశ కారణం
నమామి విఘ్నేశ్వర పాద పంకజం  

  వినాయకచవితి పద్యం
సిద్ధి విఘ్నేశ్వర నిన్ను ప్రసిద్ధిగా
    పూజింతు ఇరువదియొక్క పత్రి
దానిమ్మ మరువమ్మ దర్భ విష్ణుక్రాంత
   ఉమ్మెత్త వాకుడు ఉత్తరేణి
మామిడి గన్నేరు మారేడు జిల్లేడు
    దేవకాంచన రేగు తెల్లమద్ది
జాజి మాచీపత్రి గజనిమ్మ వావిలి
    జమ్మి రావి తులసి అగిసె మొగలి

పుడమి ఒడిలోన ఒదిగిన మొక్కలరసి
విశ్వరూపమౌ నీ చెంత విశదపరచి
భాద్రపద శుద్ధ చవితిన పగటివేళ
కోరి పూజింతు నిన్ను నా కోర్కె మీర

(చిన్నప్పుడెప్పుడో నేను నేర్చుకొన్నది. నాకు చాలా ఇష్టమైంది. తీరా చూస్తే అందులో ఛందస్సులో చాలా పొరపాట్లు కనిపించాయి. 21 పత్రాలలోనూ తేడాలు. వీటిని సవరించాలని వినాయకచవితి వచ్చినప్పుడల్లా అనిపించేది. ఇంతకాలానికి కుదిరింది. దీనిని మొదట రాసిందెవరో తెలీదు. వారు సరిగానే రాసుంటారు. కాలాంతరంలో పొరపాట్లు దొర్లుంటాయి.తొలి కవికి ప్రణమిల్లుతూ ,70 శాతం సవరణలతో ఇది మీకందిస్తున్నా. త్వరలో చిన్న పుస్తకమొకటి ప్రకటించాలనివుంది. ఇంతలో పద్యాన్ని ఉపయోగించుకొంటారని, పిల్లలికి నేర్పుతారని ఆశిస్తూఅందిస్తున్నా.)



Lord Vighneshwara is an excellent scribe; as Maharshi VedaVyasa, dictates the shlokas, he inscribed them on the leaves. He is the scribe for one lakh shloka Mahaabhaaratham, Srimathbhaagavatham and eighteen puranaas;

మరికొన్ని వినాయకచవితి పద్యాలు
తలచెద నే గణనాథుని
తలచెద నే విఘ్నపతిని దలచినపనిగా
దలచెద నే హేరంబుని
దలచెద నా విఘ్నములను తొలగుట కొరకున్

తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటీ నందన నీకు మ్రొక్కెదన్
ఫలితము సేయవయ్య నిని ప్రార్థన సేసెద నేకదంత నా
వలపటి చేతి ఘంటమున వాక్కున నెపుడు బాయకుండుమీ
తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోకనాయకా!

తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌.
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్‌.
బొజ్జగణపయ్య నీ బంటు నేనయ్య
 ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు
కమ్మనినేయుయు కడుముద్దపప్పును
పొట్టనిండా తిని పొడుచు గొలుతు--
జయమంగళం నిత్య శుభమంగళం

శ్రీ మూర్తి వంద్యునకు చిన్మయానందునకు
భాసురోతునకు శాశ్వతునకు
సోమార్కనేత్రునకు సుందరాకారునకు
కామరూపునకు శ్రీగణనాథునకు
జయమంగళం నిత్య శుభమంగళం

ఏకదంతమును ఎల్లగజవదనంబు
బాగైన తొండంబు కడుపుగలుగు
బోడైన మూషికము సొరదినెక్కాడుచు
భవ్యముగ దేవగణపతికినిపుడు
జయమంగళం నిత్య శుభమంగళం

చెంగల్వ చామంతి చెలరేగి గన్నేరు
తామర తంగేడు తరచుగాను
పుష్పజాతులు దెచ్చి పూజింతు నేనిపుడు
బహుబుద్ధీ గణపతికి బాగుగాను--
జయమంగళం నిత్య శుభమంగళం
ఏకవింశతి పత్రపూజ
ఓం గణేశ్వరాయ నమః -- ఏకవింశతి పత్రాణి పూజయామి
ఓం సుముఖాయ నమఃదాడిమీ (దానిమ్మ)పత్రం పూజయామి
 ఓం గణాధిపాయ నమఃమరువక(మరువమ్మ) పత్రం పూజయామి                           
ఓం ఉమాపుత్రాయ నమః -దుర్వార(దర్భ)పత్రం పూజయామి                        
ఓం గజాననాయ నమః - విష్ణుక్రాంతపత్రం పూజయామి                               
ఓం హరసూనవే నమఃదత్తూర(ఉమ్మెత్త)పత్రం పూజయామి                            
ఓం లంబోదరాయ నమఃబృహతీ(వాకుడు)పత్రం పూజయామి                              
ఓం గుహాగ్రజాయ నమః - అపామార్గ(ఉత్తరేణి)పత్రం పూజయామి
ఓం గజకర్ణాయ నమః - చూత(మామిడి)పత్రం పూజయామి
ఓం ఏకదంతాయ నమః - కరవీర(గన్నేరు)పత్రం పూజయామి
ఓం వికటాయ నమః - బిల్వ(మారేడు)పత్రం పూజయామి
ఓం భిన్నదంతాయ నమః - అర్క(జిల్లేడు)పత్రం పూజయామి
ఓం వటవేనమః - గండకీ(దేవకాంచన)పత్రం  పూజయామి
ఓం సర్వేశ్వరాయ నమః -  బదరీ(రేగు)పత్రం పూజయామి
ఓం ఫాలచంద్రాయ నమః - అర్జున(తెల్లమద్ది)పత్రం పూజయామి
ఓం హేరంబాయ నమః - జాజీపత్రం  పూజయామి
ఓం శూర్పకర్ణాయ నమః - మాచీపత్రం పూజయామి
ఓం సురాగ్రజాయ నమఃజంబీర(గజనిమ్మ)పత్రం పూజయామి
ఓం ఇభవక్త్రాయ నమః - సింధువార(వావిలి)పత్రం పూజయామి
ఓం వినాయకాయ నమః - శమీ(జమ్మి)పత్రం పూజయామి
ఓం సురసేవితాయ నమః - అశ్వత్థ(రావి)పత్రం పూజయామి
ఓం కపిలాయ నమః - తులసీపత్రం పూజయామి
ఓం గణేశ్వరాయ నమః - ఏకవింశతి పత్రాణి పూజయామి
1. దానిమ్మ
Sanskrit:Dadimi ; English:Pomegranate
Scientific name: Punica granatum
Family:Punicaceae
Medicinal use:
It is used mainly to control motions and bleeding.
2. మరువము
Sanskrit:Maruvaka ;English:Sweet marjoram
Scientific name: Origanum majorana
Family:Lamiaceae
Medicinal use:
It is used mainly for Rhumatic diseases and Skin diseases. 
3. దర్భ / గరిక
Sanskrit:Durvara ; English:Grass blade
Scientific name: Cyanodon dactylon
Family: Poaceae
Medicinal use:
It is used mainly in Diarrhea, Skin diseases and anti bleeding.
4. విష్ణు క్రాంత
Sanskrit:Vishnukrantha; English:Little glory
Scientific name: Evolvulus alsinoides
Family: Convolvulaceae
Medicinal use:It Improves memory and used for neurological diseases.
5. ఉమ్మెత్త
Sanskrit:Datura; English:Thorn apple
Scientific name : Datura stramonium
Family:Solanaceae
 Medicinal use: It is used mainly for Joint pains, Asthma,Skin diseases and Poisonous bites.
6. వాకుడు/ నేలములక
Sanskrit:Brihathi; English:Prickly Nightshade
 
Scientific name: Solanum indicum
Family: Solanaceae 
Medicinal use:
It is used mainly for Asthama,Cough and Constipation.

7. ఉత్తరేణి
Sanskrit:Apamarga; English :Prickly chaff
Scientific name : Achyranthes aspera
Family:Amaranthaceae
Medicinal use:
It is used mainly for digestive problems,
Skin diseases and Poisonous bites.
8. మామిడి
Sanskrit:Chutha; English:Mango
Scientific name : Mangifera indica
Family:Anacardiaceae
Medicinal use: It is used mainly for Diphtheria and Diabetes. .
9. గన్నేరు
Sanskrit:Karaveera ; English:Periwinkle
Scientific name: Thevetia neerifolia
Family:Apocyanaceae
Medicinal use:
It is used mainly for Leprosy and Heart diseases. It is poisonous in high doses.

10. మారేడు
Sanskrit:Bilva; English:Bell tree
Scientific name: Aegle marmelos
Family: Rutaceae
Medicinal use:
It is used mainly in Diabetes and Purification of  water.
11. జిల్లేడు
Sanskrit:Arka; English:Gaint milk weed
Scientific name: Calotropis gigantia
Family: Asclepiadaceae
Medicinal use:
It is used mainly as anti poisonous and for Wounds,Injuries,Skin diseases.
12. దేవకాంచన/ఆరె
Sanskrit:Gandaki ; English:Bauhinia
Scientific name:Bauhinia thonningii
Family:Fabaceae
Medicinal use:
It is used mainly for Cancer, Wounds, Headache, Toothache, Swelling and Glandular Fever.
13. రేగు
Sanskrit:Badari ; English:Goose berry
Scientific name : Zizyphus .jujuba
Family:Rhamnaceae
Medicinal use:
It is used mainly in digestive disorders,Wounds and Injuries.
14. తెల్లమద్ది / మద్ది
Sanskrit:Arjuna; English:Terminalia
Scientific name :Terminalia arjuna
Family: Combritaceae
Medicinal use:
It is used mainly in Joint pains,Wounds and Septic conditions.
15. జాజి
Sanskrit:Jaji ; English:Jasminum
Scientific name : Jasminum grandiflorum
Family : Oleaceae
Medicinal use:
It is used mainly for Skin diseases and Mouth related problems.

16. మాచ పత్రి / దవనం
Sanskrit: Machi ; English:Artmisia
 Scientific name:Artmisia indica 
Family:Asteraceae
Medicinal use:
It is used mainly in Malarial  and Abdominal diseases. It have anti insecticidal properties.
17. గజనిమ్మ/ పెద్దనిమ్మ /బత్తాయి /దబ్బ
Sanskrit:Jambeera; English:Botavian orange/Sweet Lime
 
Scientific name -Citrus limonium
Family: Rutaceae
Medicinal use:
It is used mainly in Digestive diseases.

18. వావిలి
Sanskrit:Sindhuvara; English:Chaste plant
Scientific name: Vitex nigundo
Family: Verbinaceae
Medicinal use:
It is used mainly for relieve pains in muscles and joints.

19. జమ్మి
Sanskrit:Shami ; English:Acacia
Scientific name: Acacia spicigera
Family: Mimosaceae
Medicinal use:
It is used mainly for respiratory and digestive problems. 
20. రావి
Sanskrit:Aswatha; English:Pepal
Scientific name: Ficus religiosa
Family: Moraceae
Medicinal use:
It is used mainly in digestive problems,enhances reproductivity and anti bleeding.
21. తులసి
Sanskrit:Tulasi; English:Holy basil
Scientific name: Ocimum sanctum
Family:Lamiaceae
Medicinal use: It is used mainly in respiratory diseases,purification of  water and air.


22. అగిసె/రేల/తంగేడు
Sanskrit:Agasthya; English:Peacock’s pride
Scientific name: Cassia fistula
Family: Fabaceae
Medicinal use: A remedy for tumors,burns,Skin diseases, Psoriasis, Malaria and Rheumatism.
23. మొగలి
Sanskrit:Kethaki ; English:Screw pine
Scientific name:Pandanus odoratissimus
Family: Pandanaceae
Medicinal use:
It is used mainly for Headache, Rheumatism, Cold/flu, Wounds,Hepatitis, and Smallpox.
24. వెలగ
Sanskrit:Kapithha; English:Wood Apple

Scientific name: Limonia acidissima
Family:Rutaceae
Medicinal use: It is used mainly as a liver tonic to stimulate the digestive system.

No comments:

Post a Comment