హరితలో స్వాతంత్య్ర దినోత్సవం
15-8-2017
హరితావరణ విద్యా పీఠం లో స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా జరిగింది . విద్యార్థులు ఆసనాలు,కరాటే ,కోలాటం ,యోగ చాప్ ,జడకోలాటం ,రంగులరాట్నం ,బ్యాండ్ తదితరాలు ప్రదర్శించారు . జాతీయ జెండా ఎగురవేసిన మాస్టర్ ఈ.కె.ట్రస్ట్ హోమియో వైద్య సేవా కేంద్ర నిర్వాహకులు శ్రీ రవిప్రసాద్ అమర వీరులకు శ్రద్ధాంజలి సమర్పించి, స్వాతంత్య్రఉద్యమాన్ని గుర్తు చేశారు . ఈ కార్యక్రమంలో విద్యార్థులు ,ఉపాధ్యాయులతోబాటు, హరిత పూర్వ విద్యార్థులు, హరితావరణ విద్యా పీఠం నిర్వాహకులు డాక్టర్ సుధాకర్ , శ్రీమతి పి . ఉషారాణి, మాస్టర్ ఈ.కె.ట్రస్ట్ ,పాల్వంచ సభ్యులు ,బసవతారక కాలనీ ,ఇందిరా నగర్ కాలనీ ,విద్యా నగర్ కాలనీ ,సీతానగర్ కాలనీ,సోముల గూడెం ,కేశవాపురం తదితర ప్రాంతాలనుండి ప్రజలు కూడా పాల్గొన్నారు
No comments:
Post a Comment