వినాయకచవితి పద్యం
సిద్ధి విఘ్నేశ్వర నిన్ను ప్రసిద్ధిగా
పూజింతు ఇరువదియొక్క పత్రి
దానిమ్మ మరువమ్మ దర్భ విష్ణుక్రాంత
ఉమ్మెత్త వాకుడు ఉత్తరేణి
మామిడి గన్నేరు మారేడు జిల్లేడు
దేవకాంచన రేగు తెల్లమద్ది
జాజి మాచీపత్రి గజనిమ్మ వావిలి
జమ్మి రావి తులసి అగిసె మొగలి
పుడమి ఒడిలోన ఒదిగిన మొక్కలరసి
విశ్వరూపమౌ నీ చెంత విశదపరచి
భాద్రపద శుద్ధ చవితిన పగటివేళ
కోరి పూజింతు నిన్ను నా కోర్కె మీర
(చిన్నప్పుడెప్పుడో నేను నేర్చుకొన్నది.నాకు చాలా ఇష్టమైంది. తీరా చూస్తే అందులో ఛందస్సులో చాలా పొరపాట్లు కనిపించాయి. 21 పత్రాలలోనూ తేడాలు. వీటిని సవరించాలని వినాయకచవితి వచ్చినప్పుడల్లా అనిపించేది. ఇంతకాలానికి కుదిరింది. దీనిని మొదట రాసిందెవరో తెలీదు. వారు సరిగానే రాసుంటారు. కాలాంతరంలో పొరపాట్లు దొర్లుంటాయి.తొలి కవికి ప్రణమిల్లుతూ ,70 శాతం సవరణలతో ఇది మీకందిస్తున్నా.త్వరలో చిన్న పుస్తకమొకటి ప్రకటించబోతున్నా. ఇంతలో ఈ పద్యాన్ని ఉపయోగించుకొంటారని ,పిల్లలికి నేర్పుతారని ఆశిస్తూ … అందిస్తున్నా.)